కొండవాలు ప్రాంతాలను పరిశీలించి ఎమ్మెల్యే

విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు కొండ వాలు ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే గణబాబు సోమవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జోనల్ కమిషనర్ రామును ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.