రహదారి దుస్థితిపై గ్రామస్థుల ఆవేదన
ASR: మారేడుమిల్లి మండలం కుందాడ, జి.ఎం. వలస గ్రామాల మధ్య ఇటీవల ఏర్పాటు చేసిన తారు రహదారి మూడు నెలలు కూడా నిలవకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రహదారి ఇప్పటికే పెచ్చులూడి మెటల్ బయటపడిపోయే స్థితికి చేరిందని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, నిర్మాణంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.