VIDEO: ఆటో బోల్తా.. వృద్ధుడికి తీవ్ర గాయాలు
BPT: అద్దంకి మండలం శ్రీనివాసనగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వృద్ధునికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.