విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
NRML: కూలర్లో నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దిపడగకు చెందిన కారం సుశీల (49) ఇంట్లో కూలర్ ఆన్ చేసి అందులో నీళ్ళు పోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి సుశీల అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనలో తన తండ్రి అబ్రహంకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.