VIDEO: కొడుకు అల్లరి ఎక్కువైందని కొట్టి చంపిన తండ్రి
HYD: అల్లరి ఎక్కువ చేస్తున్నాడని సవతి తండ్రి బాలుడిని కొట్టి చంపిన ఘటన చాంద్రాయణ గుట్టలో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్త ఉండగానే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో మొదటి భర్త కుమారుడి అల్లరి ఎక్కువైందనే కోపంతో సవతి తండ్రి ఆ బాలుడిని నేలకు కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.