గంజాయి పట్టివేత, వ్యక్తి అరెస్టు

గంజాయి పట్టివేత, వ్యక్తి అరెస్టు

WGL: చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు మూడు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తీసుకువచ్చి మండలంలో విక్రయిస్తున్న పడిదం ప్రదీప్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.