ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
ASR: అరకులోయ ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపారు. ఎంపీడీవో లవరాజు, ప్రిన్సిపాల్స్ డా నాయక్, చలపతిరావులు డా.బీ ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949, నవంబర్ 26 రోజును గుర్తు చేసుకునేలా ప్రభుత్వం 2015 నుంచి నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందన్నారు.