3 వేల ఎకరాల్లో బార్క్ భారీ క్యాంపస్
AP: దేశంలో అణుశాస్త్ర పరిశోధనలు, ఆధునిక రియాక్టర్ టెక్నాలజీలను మరింత బలోపేతం చేసేందుకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) రాష్ట్రంలో భారీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో 3 వేల ఎకరాల్లో క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1,200 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమిని సేకరించారు.