'బాధితులు నిర్భయంగా సమస్యలు తెలియజేయాలి'

'బాధితులు నిర్భయంగా సమస్యలు తెలియజేయాలి'

BHPL: బాధితులు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ సమస్యలను పోలీసులకు తెలపాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖేరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన 18 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని ఆదేశించారు.