'జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి'

శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య, విద్యుత్, వ్యవసాయ, పంచాయతీ, రెవెన్యూ, పశు సంవర్ధక శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చంనాయుడు ఆదేశించారు.