కానూరులో ఎమ్మెల్యే బోడె పర్యటన
కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరులో బుధవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. చెత్త సేకరణ, కాలువల శుభ్రత, రహదారుల పరిశుభ్రత, డ్రైనేజీ నిర్వహణ పనులను పరిశీలించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం నుంచే విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.