ఈ నెల 18 నుంచి కొనుగోలు కేంద్రం మూసివేత

ADB: బోథ్ మార్కెట్ యార్డ్ పరిధిలోని ధన్నూర్ (బి) మార్కెట్‌లో ఉన్న జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 18 నుంచి శాశ్వతంగా మూసివేస్తున్నట్లు బోథ్ మార్కెట్ యార్డ్ ఇన్‌ఛార్జ్ గోలి స్వామి తెలిపారు. రైతుల దగ్గర మిగిలి ఉన్న పంటను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలలోపు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.