మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి
MNCL: మంచిర్యాల నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం మాజీ సీఎం రోశయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా 15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత రోశయ్యకు దక్కుతుందన్నారు.