ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొల్లేరు

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కొల్లేరు

ELR: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో కొల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మణుగునూరు,పెనుమాకలంక మధ్య రహదారి మునిగి, రాకపోకలు నిలిచిపోయాయి. పెద ఎడ్లగాడి వంతెన వద్ద శనివారం 2.5 మీటర్ల మేర నీరు ప్రవహిస్తుందని, మరో మీటరు వరద పెరిగితే లంక గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని లంకవాసులు భయాందోళన చెందుతున్నారు.