'ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే నా లక్ష్యం'

BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. మండల వ్యాప్తంగా పర్యటించిన ఎమ్మెల్యే పలువురికి ప్రభుత్వం తరఫున మంజూరు అయిన సీఎం సహాయం చెక్కులను పంపిణీ చేశారు. 12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేశారు. విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు.