'రైతులు ఆధునిక పంటలపై దృష్టి పెట్టాలి'
VZM: వేపాడ మండలం డబ్బిరాజుపేట రైతు సేవ కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి లక్ష్మినారాయణ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ వ్యవసాయం కొత్త ఉత్పత్తులు మార్పు తేవాలని సూచించారు. పంట మార్పిడి అధిక డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని హితవు పలికారు.