VIDEO: ఏప్రిల్ 20న అధ్య శిలా స్థాపన మహోత్సవం
SRD: సంగారెడ్డిలోని జ్యోతిర్వాస్తు ఆశ్రమంలో ఏప్రిల్ 20న ఆద్య శిలా స్థాపన మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి మంగళవారం ఉత్తర భారతంలోని సరస్వతీ నదిలో పంచ శిలలకు మహాభిషేకం చేశారు. బీజాక్షర లిఖితమైన ఈ శిలలను ఆశ్రమ దేవాలయ ఉత్తరద్వారం కింద ప్రతిష్టించనున్నారు. పవిత్ర నదీ జలాలతో శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజలో పలువురు భక్తులు పాల్గొన్నారు.