బెస్తవారిపేట మండల ప్రజలకు ఎస్సై హెచ్చరికలు

బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే రూ. 100 జరిమానా విధించబడుతుందని బెస్తవారిపేట ఎస్సై రవీంద్ర రెడ్డి హెచ్చరించారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో బహిరంగ ప్రదేశంలో సిగరెట్లు తాగుతూ ఉన్న ముగ్గురు వ్యక్తులను ఒక్కొక్కరికీ రూ. 100 చొప్పున జరిమానా విధించారు.