VIDEO: ఫ్రూట్స్ వ్యాపారిపై హత్యాయత్నం
కృష్ణా: మచిలీపట్నంలో ఫ్రూట్స్ వ్యాపారిపై శుక్రవారం హత్యాయత్నం జరిగింది. దుండగుడు వ్యాపారి చల్లపల్లి పవన్‌పై పనసకాయ కత్తితో ముఖంనుంచి పొట్ట వరకు దాడి చేశాడు. గతంలో ఇద్దరు స్నేహితుల పాత గొడవల నేపథ్యంలో దాడికి పాల్పడినట్లు స్నేహితుడు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.