'సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగాఉండాలి'
NRPT: పెరుగుతున్న టెక్నాలజీని వాడుతూ సైబర్ నేరగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని వారి పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన "ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్" వాల్ పోస్టర్‌ను మంగళవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో విడుదల చేశారు.