ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

VZM: గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం RTC బస్సు, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత(48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో బస్సు ముందు చక్రం మృతురాలి తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు.