ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ
AP: టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ ముగిసింది. ఆయన్ను సిట్ అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. ఈ సందర్భంగా ఆయనకు కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. విచారణ అనంతరం సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. మరోసారి అవసరమైతే విచారిస్తామని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.