LoC వెంబడి కొనసాగుతున్న పాక్ కవ్వింపు చర్యలు

నియంత్రణ రేఖ LoC వెంబడి పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. సరిహద్దు చెక్ పోస్టుల సమీపంలో పాక్ రేంజర్లు దాడి చేశారు. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషేరా, మెంధర్, సుందుర్భని, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిపారు. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా ఎదుర్కొంది. కాగా, గత 10 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది.