పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ: జూపల్లి

పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ: జూపల్లి

TG: పర్యాటకులకు, పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను ఆవిష్కరిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జర్మన్‌కి చెందిన పలువురు ప్రతినిధులతో భేటీ అయిన జూపల్లి.. రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించామన్నారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నామన్నారు.