100% సీట్లు భర్తీ చేయాలి: అడిషనల్ డైరెక్టర్
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహాన్ని షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని వస్తువులతో కూడిన కిట్లను విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. వసతి గృహంలో 100% సీట్లు భర్తీ చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు.