అటెండర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
ATP: అనంతపురం జిల్లా లోక్ అదాలత్‌లో అటెండర్ పోస్టు భర్తీకి జిల్లా న్యాయాధికారి భీమారావు దరఖాస్తులు కోరారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవాలని, వాటిని పూరించి ఏప్రిల్ 13లోగా కార్యాలయానికి పంపాలని ఆయన సూచించారు.