కార్మికుల సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే

కార్మికుల సమస్యలపై చర్చించిన ఎమ్మెల్యే

పార్వతీపురం నియోజకవర్గంలో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సోమవారం సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కార్యదర్శి ఎం.వి శేషగిరి బాబు (ఐఏఎస్)ను అమరావతిలో కలిసిన ఎమ్మెల్యే, సీతానగరం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను ప్రస్తావించారు. వారికి రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.