రైలు నుంచి జారిపడి విద్యార్థిని మృతి

నల్గొండ: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి నల్గొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం బోయిన్‌పల్లికి చెందిన పీఎన్ రిత్విక(18) చెన్నై ఎక్స్ ప్రెస్ రైలులో చర్లపల్లి నుంచి చెన్నై వెళ్తుంది. నల్గొండ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలపారు.