రేపల్లెలో రాయితీపై పశు దాణా పంపిణీ

BPT: రేపల్లెలోని పశు వైద్యశాలలో మంగళవారం ఏపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాయితీపై పశు దాణా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు 50% రాయితీతో పశువుల దాణాను అందించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు రాయితీపై దాణా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నాణ్యమైన దాణా అందించడం వల్ల పశువులకు ఆరోగ్యంతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు.