మేడారం హుండీల ఆదాయం వివరాలు
MLG: మేడారం సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల ఆలయ ప్రాంగణంలో నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసిన 20 హుండీలను బుధవారం లెక్కించారు. ఈ హుండీల ద్వారా మొత్తం రూ. 27,00,177 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. హుండీల వారీగా ఆదాయ వివరాలు: సమ్మక్క హుండీ: రూ. 15,16,975 సారలమ్మ హుండీ: రూ. 10,96,025 గోవిందరాజు హుండీ: రూ. 41,956 పగిడిద్దరాజు హుండీ:రూ.36,321