'3 ట్రిలయన్ డాలర్ల ఎకానమీ సాధనే మా లక్ష్యం'
TG: రెండేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణ డెవలప్‌మెంట్‌కి రోడ్ మ్యాప్ లాంటిదని అన్నారు. రానున్న రెండు దశాబ్దాల్లో 3 ట్రిలయన్ డాలర్ల ఎకానమీ సాధనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో రోడ్ మ్యాప్ తయారు చేసినట్లు తెలిపారు.