VIDEO: 'అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్నాయి'
KKD: అన్న క్యాంటీన్లు పేద ప్రజల ఆకలి తీరుస్తున్నాయని జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద సోమవారం నిర్వహించిన ఉచిత అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాలుగేళ్లుగా దాతల సహకారంతో ప్రతి సోమవారం ఉచితంగా భోజనాలు అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ అన్నా కాంటీన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.