VIDEO: అలరించిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' పద్య నాటకం
GNTR: తెనాలిలో వీణ అవార్డ్స్ జాతీయ స్థాయి నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' నాటక ప్రదర్శనతో పోటీలు ప్రారంభమయ్యాయి. టీజీవి కల్చరల్ అకాడమీ కర్నూలు వారి సమర్పణలో శారదా ప్రసన్న రచనలో వివి రమణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.