"మౌలిక వసతులు ఏర్పాటుపై నివేదికను తయారు చేస్తాం'

RR: షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల అధ్యయనానికి BJP మండల శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించారు. మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి పర్వతాపూర్‌లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకై సమగ్ర నివేదికను తయారు చేయనున్నట్లు తెలిపారు.