ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్
MHBD: మరిపెడ పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి విందు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆయన స్వీట్లు, పండ్లు తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులున్నారు.