వాస్మోల్ తాగి వివాహిత మృతి
NDL: బేతంచెర్లలోని హనుమాన్ నగర్‌కు చెందిన నాయకంటి సుజాత(24) అనే వివాహిత కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించిందని ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. ఈ నెల 21న సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని తల్లి లక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.