‘పోగొట్టుకున్న బంగారం అందజేసిన సిబ్బంది’

‘పోగొట్టుకున్న బంగారం అందజేసిన సిబ్బంది’

BHNG: యాదాద్రి దర్శనానికి వచ్చిన కొండమడుగుకు చెందిన మల్లమ్మ దంపతులు పోగొట్టుకున్న బంగారు పుస్తెలతాడును గ్లోబల్ సెక్యూరిటీ సిబ్బంది వినయ్, నరసింహ గుర్తించారు. వెంటనే మైక్ ద్వారా అనౌన్స్ చేయించి, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో దానిని బాధితులకు అందజేశారు. సిబ్బంది నిజాయితీని ఆలయ అధికారులు, భక్తులు అభినందించారు. నగ తిరిగి దక్కడంతో ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.