'ఐటీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'
BDK: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో 14 రోజులకు చేరుకుంది. సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. యాజమాన్యం కార్మికుల పట్ల చిన్నచూపు ధోరణి అవలంబించడం, వారి కష్టాలను గుర్తించకపోగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా జేఏసీ నాయకులతో చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.