VIDEO: '25 నెలల్లో 140 మంది విద్యార్థులు మరణించారు'
SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 నెలల్లో హాస్టల్స్‌లో 140 మంది విద్యార్థులు మరణించారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థిని శ్రావణి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మరణించింది అన్నారు.