అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
NLR: కందుకూరులో ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని టౌన్ AE నరసింహం తెలిపారు. నిర్వహణ పనుల కోసం తూర్పు కమ్మపాలెం, తూర్పు సాలెపాలెం, తూర్పు వడ్డెపాలెం, కోటారెడ్డి నగర్, మారెమ్మ మిట్ట, బూడిదపాలెం, సంతోష్ నగర్, గుర్రంవారి పాలెం, తదితర ప్రాంతాలలో ఉ.9 నుంచి మ.12 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదన్నారు. వినియోగ దారులు సహకరించాలని కోరారు.