VIDEO: సింహాచలం సెక్యూరిటీ గార్డుపై కత్తులతో దాడి
విశాఖ: సింహాచలం దేవస్థానం సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న లక్ష్మణరావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటన అప్పన్న అనుబంధ దేవాలయం కొండ దిగువన వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిన్న రాత్రి జరిగింది. విధుల కోసం వెళ్తుండగా కొందరు వ్యక్తులు కత్తితో ముఖం, తలపై దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. సుమారుగా 30 కుట్లు పడ్డాయని వైద్యులు పేర్కొన్నారు.