మద్యం మత్తులో విధ్వంసం

మద్యం మత్తులో విధ్వంసం

ASF: కాగజ్‌నగర్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి విధ్వంసం సృష్టించాడు. పంచశీలనగర్‌కు చెందిన దుర్గం రాహుల్‌ మద్యం మత్తులో అంబేడ్కర్‌ చౌరస్తా వైపు కారులో అతివేగంగా వచ్చాడు. విగ్రహం బేస్‌మెంట్‌ను, అక్కడి నుంచి సమీపంలోని విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతోపాటు, రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్నాడు. నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.