పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

WGL: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ బి సాంబశివరావు పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. మాతా-శిశు ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు వంటి కార్యక్రమాలపై సమీక్షించి సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు.