పటేల్ సేవలు స్మరించుకుందాం: లోకేష్
AP: సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు మంత్రి లోకేష్ నివాళులర్పించారు. దేశ ఐక్యతకు కృషి చేసిన వ్యక్తి పటేల్ అని కొనియాడారు. దేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారన్నారు. దృఢమైన సంకల్పం ఆయన సొంతమని చెప్పారు. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశానికి సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.