'మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి'

'మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి'

MDK: పోరాటాల ద్వారానే మహిళలకు హక్కులు లభించాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడుతూ.. గతంలో మహిళలకు ఓటు హక్కు కూడా లేని వివక్ష ఉండేదని గుర్తు చేశారు. మహిళలు బలహీనులు కాదు, బలవంతులని, అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.