MBNR: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బ్యానర్ల రచ్చ

MBNR: జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఏదైనా పార్టీలో చేరిన తర్వాతే పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తాయి. కానీ, ఇక్కడ 'చేరబోయే నేతలు' అంటూ ముందుగానే బ్యానర్లు కనిపించడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ఈ బ్యానర్లు వెలిశాయి.