లైన్ సోయింగ్, కాలి బాటల విధానంలో నాట్లు

ASR: బీజామృతం ద్వారా వరినారు శుద్ధి చేసుకుని నాట్లు వేసుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుందని, తెగుళ్లు సోకే అవకాశం తక్కువగా ఉంటుందని రైతు సాధికార సంస్థ ఫీల్డ్ డివిజన్ ఇంఛార్జ్ వెంకట్ తెలిపారు. ఆదివారం జీకేవీధి మండలం రింతాడలో వైస్ సర్పంచ్ సోమేష్ కుమార్, సిబ్బందితో కలిసి వరి పొలాలు పరిశీలించారు. రైతులతో కలిసి లైన్ సోయింగ్, కాలి బాటల విధానంలో నాట్లు వేశారు.