ఎన్నికల క్లస్టర్‌లను సందర్శించి రవి ఐఏఎస్
SRPT: సూర్యాపేట మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను ఇవాళ ఎన్నికల పరిశీలకుడు రవి ఐఏఎస్ పరిశీలించారు. మండలంలోని ఏపూర్ క్లస్టర్‌లో గల తుమ్మల పెన్ పహాడ్ గ్రామపంచాయతీలో నామినేషన్ ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.