అత్తలూరు పీహెచ్సీ పరిశీలించిన ఎమ్మెల్యే భాష్యం
PLD: అత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం తనిఖీ చేశారు. డాక్టర్లు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. రిజిస్టర్‌ను పరిశీలించి, వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. నూతన భవనం నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించామని డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు.