మారథాన్‌లో గుంటూరు పోలీసులకు పతకాలు
GNTR: హైదరాబాద్‌లో జరిగిన NMDC మారథాన్– 2025లో గుంటూరు జిల్లా పోలీసు సిబ్బంది మెరిశారు. నల్లపాడు పీఎస్ ఏఎస్సై కె.రాజశేఖర్ బాబు (4గం.42ని), జిల్లా పోలీస్ కార్యాలయ హోంగార్డు జి.కృష్ణ కిషోర్ (4గం.59ని) ఫుల్ మారథాన్ (42 కి.మీ)ను 5 గంటల్లోపే పూర్తి చేసి పతకాలు గెలుచుకున్నారు. మంగళవారం వారిని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు.